కీ చైన్‌.. గూగుల్‌ పే

Street Merchants Use Digital Payments in Hyderabad - Sakshi

కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో మార్కెట్‌లో చిత్ర విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బడా షాపింగ్‌ మాల్స్, పెద్ద పెద్ద దుకాణాల్లోనే గూగుల్‌ పే వసతి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. కరెన్సీతో కరోనా సోకుతుందనే భయం కొందరిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కీ చైన్‌ల విక్రయదారు గూగుల్‌ పే ద్వారా డబ్బులు చెల్లించే వెసులుబాటును ఏర్పర్చుకున్నాడు. ఈ ‘వి’చిత్రం మంగళవారం కుత్బుల్లాపూర్‌లో కనిపించింది.    

భౌతికదూరమేశ్రీరామరక్ష!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించడమే సరైన మార్గం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని అనుసరించడం తప్పనిసరిగా మారుతోంది. మంగళవారం పంజగుట్టలోని ఓ ఎలక్ట్రానిక్‌ షాపులో వినియోగదారులు ముఖానికి మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించి కొనుగోళ్లు చేశారు.      

చార్మినార్‌.. షాన్‌దార్‌..

చారిత్రాక స్మారకం.. అద్భుత నిర్మాణ వైభవం.. నాలుగు స్తంభాల్లోని నిర్మాణ శైలి అపురూపం.. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ నగరానికి చిహ్నం చార్మినార్‌. రంజాన్‌ పర్వదినం రోజు వెలిగిపోయినచార్మినార్‌కు మరుసటి రోజు ప్రకృతి రంగులద్దింది. మంగళవారంసాయంత్రం వేళ సప్తవర్ణ శోభితంగాచార్మినార్‌ వెలిగిపోయింది.ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఆ కట్టడం మరింతఆకర్శణీయంగా కనిపించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top