ప్రోటోకాల్‌ ప్రకారమే కరోనా శాంపిల్‌ సేకరణ 

State Health Department Guidelines To Private Hospitals Over Coronavirus Treatment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ అనుమానితుల శాంపిల్‌ సేకరణ మొత్తం ప్రోటోకాల్‌ ప్రకారమే జరగాలని రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది. తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. గురువారం కరోనా వైరస్‌కు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు రాష్ట్ర వైద్యశాఖ గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఈ మేరకు ‘‘ ప్రతి హాస్పిటల్‌లో కరోనా అవగాహన కోసం కరపత్రాలు, బోర్డులు ఏర్పాటు చెయ్యాలి. ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్లను ఇతరులతో కలపవద్దు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఎవరైనా విదేశీ పర్యాటకులు హాస్పిటల్స్‌కు వస్తే వాళ్ల పూర్తి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కరోనా వార్డులో వేస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలోని డాక్టర్లకు వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించాల’’ ని తెలిపింది. ( కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని )

ఆరుగురు సభ్యులతో కరోనా నిర్థారణ కమిటీ
ఆరుగురు సభ్యులతో కరోనా నిర్థారణ కమిటీ ఏర్పాటైంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కమిటీని వేసింది. కమిటీలో వైరాలజీ ల్యాబ్, మైక్రో బయోలజీ హెచ్ఓడిలు ఉన్నారు. గురువారం డీఎంఈ కమిటీ మెంబర్లతో భేటీ అయింది. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో సరిపడా సిబ్బందిని కేటాయించటం, సాంఫుల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడంలో జాప్య జరగకుండా చూడడం, ఐసోలేషన్ వార్డుకు వచ్చిన వారికి సరైన వసతులు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై డీఎంఈ అండ్‌ టీం చర్చించింది. ( కరోనా.. కొరియా టు గోదశివారిపాలెం )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top