సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు

Special Trains From Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–కాకినాడ, సికింద్రాబాద్‌–శ్రీకాకుళం రోడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌–కాకినాడ (07053/07054) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 23వ తేదీ రాత్రి 8.45కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–శ్రీకాకుళం రోడ్‌ (07026/07025) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 17వ తేదీ రాత్రి 7.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 18వ తేదీ మధ్యాహ్నం 2.30కు శ్రీకాకుళం రోడ్‌ బయలుదేరి మరుసటి రోజు ఉ దయం 6.30కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top