అధికార భాష అమలులో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ విభాగాలు ప్రదర్శిస్తున్న చొరవ అభినందనీయమని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్నారు.
	సాక్షి, హైదరాబాద్: అధికార భాష అమలులో  ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ విభాగాలు ప్రదర్శిస్తున్న చొరవ అభినందనీయమని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్నారు. బుధవారం రైల్‌నిలయంలో జరిగిన 147వ అధికార భాష అమలు కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జోన్‌లోని అన్ని డివిజన్‌లు, వర్క్‌షాపులు, ఇతర అన్ని కేంద్రాల్లో అధికార భాష అమలును మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా  రైల్వేబోర్డు స్థాయి నగదు అవార్డులు సాధించిన పలువురు ఉద్యోగులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హిందీ అమలుపై రూపొందించిన ఒక బుక్‌లెట్‌ను ఆయన విడుదల చేశారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
