త్వరలోనే పార్టీ కమిటీలు | Soon the party committees | Sakshi
Sakshi News home page

త్వరలోనే పార్టీ కమిటీలు

Jan 20 2015 1:04 AM | Updated on Mar 22 2019 6:16 PM

త్వరలోనే పార్టీ కమిటీలు - Sakshi

త్వరలోనే పార్టీ కమిటీలు

జిల్లాలో త్వరలోనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు.

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడ జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
నూతన భవనంలోకి జిల్లా కార్యాలయం

 
హన్మకొండ : జిల్లాలో త్వరలోనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. హన్మకొండ నక్కలగుట్టలోని నూతన భవనంలోకి మార్చిన  వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.శివకుమార్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, నాయకులు అప్పం కిషన్, శంకరాచారి, నాడెం శాంతికుమార్, కాయిత రాజ్‌కుమార్, మైపాల్‌రెడ్డి, దయాకర్, రజనీకాంత్, శ్రవణ్, సమ్మయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.
 
50 మంది చేరిక

 వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. 11,17,18,22,23,47 డివిజన్లకు చెందిన శివాజీ, తార్జన్‌సింగ్, నిఖిల్, అనిల్, వంశీ, మహేశ్, అజయ్, సుమన్, శివ, శ్రీనివాస్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement