
గంజాయి తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
అశ్వాపురం: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఆదివారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 50 కిలోల గంజాయి, రూ.లక్షన్నర నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితుల్లో ఓ మహిళ కూడా ఉండడం విశేషం. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.