ఈదురు గాలులతో షార్ట్‌సర్క్యూట్ | Short circuit due to gusty winds | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులతో షార్ట్‌సర్క్యూట్

Apr 1 2016 7:51 PM | Updated on Oct 16 2018 3:12 PM

ఎర్త్‌ వైర్ తెగి విద్యుత్ సరఫరా చేసే లైన్‌పై పడటంతో ఒక్కసారిగా హైవోల్టేజీ కరెంట్ వచ్చి పలువురి ఇళ్లలోఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయిన సంఘటన మెదక్ మండలం మంభోజిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

మెదక్ రూరల్ : ఎర్త్‌ వైర్ తెగి విద్యుత్ సరఫరా చేసే లైన్‌పై పడటంతో ఒక్కసారిగా హైవోల్టేజీ కరెంట్ వచ్చి పలువురి ఇళ్లలోఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయిన సంఘటన మెదక్ మండలం మంభోజిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మంభోజిపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద శుక్రవారం వీచిన గాలికి ఎర్త్‌వైర్ తెగి ఫేస్ వైర్‌పై పడింది.

దీంతో హైవోల్టేజ్ వచ్చి గ్రామంలోని అనేక మంది ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్, మోటార్లు, బల్బులు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేర నష్టం జరిగిందని పలువురు బాధితులు పేర్కొన్నారు. వీధిలైట్లు సైతం కాలిపోయినట్లు సర్పంచ్ గంజి ప్రభాకర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement