షర్మిల యాత్రకు విశేష స్పందన | Sharmila trip to the widespread | Sakshi
Sakshi News home page

షర్మిల యాత్రకు విశేష స్పందన

Sep 8 2015 11:58 PM | Updated on May 29 2018 4:23 PM

షర్మిల యాత్రకు విశేష స్పందన - Sakshi

షర్మిల యాత్రకు విశేష స్పందన

తమ పార్టీ నాయకురాలు షర్మిల వరంగల్ జిల్లాలో చేస్తున్న పరామర్శయాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్

♦ రాజన్న రాజ్యాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజానీకం
♦ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్ రెడ్డి
 
 మహబూబ్‌నగర్ అర్బన్ : తమ పార్టీ నాయకురాలు షర్మిల వరంగల్ జిల్లాలో చేస్తున్న పరామర్శయాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ప్రారంభించిన మలిదశ పరామర్శయాత్రలో తాము కూడా పాల్గొన్నామని వెల్లడించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం పెద్దదిక్కును కోల్పోయామని మహిళలు, వృద్ధులు షర్మిలమ్మతో చెప్పుకుంటున్నారని అన్నారు.

రాజన్న రాజ్యం ఉన్నప్పుడే తమకు పింఛన్లు, 104 అంబులెన్స్ ద్వారా నెల నెల వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు అందేవని, పెద్దపెద్ద రోగాలు వస్తే ఆరోగ్యశ్రీ తమకు అండగా ఉండేదని ప్రజానీకం గుర్తుచేసుకుంటున్నదని పేర్కొన్నారు. తమ నాయకురాలు ఓర్పుతో అందరినీ పలకరించి.. మున్ముందు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంచి రోజులుస్తాయని, వారికి మనోధైర్యాన్ని కలిగిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కూడా బహిరంగంగా చర్చించుకుంటున్నారని అన్నారు. షర్మిలయాత్రలో జిల్లా నుంచి తమ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదర్‌అలీ, జిల్లా కార్యదర్శి సర్దార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఇందిర, పార్టీ జిల్లా కార్యదర్శి మరియమ్మ  పాల్గొన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement