రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం | Seven killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

Feb 19 2019 2:38 AM | Updated on Feb 19 2019 2:38 AM

Seven killed in road accident - Sakshi

బోల్తా పడిన వాహనాన్ని తీస్తున్న స్థానికులు

షోలాపూర్‌: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా తుల్జాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. దైవదర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల వాహనంను ఓ ట్యాంకరు ఢీకొట్టింది. మరణించిన వారందరు షోలాపూర్‌లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మరణించిన వారిని చిలువేరి రజనీ (35), చిలువేరి అపర్ణ (13), ఆడం వర్ష (12), శివకుమార్‌ పోబత్తి (40), నర్మదా పోబత్తి (35), నేతాజీ పోబత్తి (12), శ్రద్ద పోబత్తి (4), ఆడం లింగరాజ్‌ (12)లుగా గుర్తించారు.

తుల్జాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తుల్జాపూర్‌ ఘాట్‌ ప్రాంతంలో శింథపులే గ్రామం వద్ద సోమవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటచేసుకుంది. షోలాపూర్‌ గోదుతాయి పెరుళేకర్‌ గృహ సముదాయంలో నివసించే గడ్డం, చిలువేరి, ఖ్యాతం, పోబత్తి కుటుంబాలు ఓమినీ కారు అద్దెకు తీసుకుని తుల్జాపూర్‌ దైవదర్శనానికి బయలుదేరారు. తుల్జాపూర్‌ ఘాట్‌లో శింథపలే గ్రామం వద్ద ఓ ట్యాంకర్‌ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఓమినీ కారు నుజ్జు నుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement