‘సమత’కేసు నిందితుల తరఫు న్యాయవాది రహీం

Senior Counsel Raheem Appointed To Represent Accused In the Samata case - Sakshi

కోర్టు ఆదేశం మేరకు అంగీకారం

ఆదిలాబాద్‌టౌన్‌: సంచలనం రేపిన సమత కేసు విషయంలో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్‌ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు అయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో నిందితుల కేసు పత్రాలను స్వీకరించారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్, షేక్‌ ముగ్దూమ్‌లను బుధవారం మరోసారి కోర్టు ఎదుట హాజరు పర్చనున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు 44 మంది సాక్షులను విచారించారు. ఈ నెల 19 నుంచి కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణారెడ్డి, నిందితుల తరపు న్యాయవాది రహీం తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top