శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌

Satyavati Rathod Visited Tirumala Temple - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్‌: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ శనివారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించే నైవేధ్య పూజా సమయంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎమ్మెల్సీకి ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన   సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top