పైసలిస్తేనే పింఛన్లు | Sarpanch husband recovery | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే పింఛన్లు

Jan 13 2015 1:29 AM | Updated on Sep 2 2017 7:36 PM

పల్లెల్లో ప్రభుత్వం అందించే ఆసరా పథకం కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు వరంగా మారింది.

పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తుల ఆరోపణ
 
పరకాల రూరల్ : పల్లెల్లో ప్రభుత్వం అందించే ఆసరా పథకం కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు వరంగా మారింది. పింఛన్ జాబితాలో పేర్లు రాని అర్హులకు పింఛన్ ఇప్పిస్తామని కార్యదర్శి, సర్పంచ్ భర్త డబ్బులు వసూలు చే సిన సంఘటన మండలంలోని సీతారాంపురంలో వెలుగు చూసింది. మూడు నెలలుగా తమకు పింఛన్ రాకపోవడంతో సర్పంచ్ అడుప వసంతను వెళ్లి అడగగా ఆమె భర్త సత్యం ఒక్కొక్కరి వద్ద రూ.1000 చొప్పున వసూలు చేసినట్లు పింఛన్ కోసం ఎదురు చూస్తున్న పలువురు బాధితులు వెల్లడిం చారు.

ఇదే పద్ధతిలో పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి కూడా డబ్బులు వసూలు చే స్తున్నట్లు పలువురు గ్రామస్తులు వాపోయూరు. ఈ క్రమంలోనే గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీకి వచ్చిన పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మిని వృద్ధులు, వికలాంగులు నిలదీశారు. తమకు మూడు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదని, తమకు ఇస్తేనే అందరికి పింఛన్ ఇవ్వాలని సర్పంచ్ ఇంటి ఎదుట, గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేశారు. ఉదయం నుంచి సాయత్రం వరకు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సర్వమ్మ అనే వృద్ధరాలు సొమ్మసిల్లిపడిపోరుుంది.

ప్రతిఒక్కరి వద్ద డబ్బులు తీసుకుంటున్నారు  : పేర్వాల రమేష్, గ్రామస్తుడు

 అర్హులైన వారి వద్ద కూడా డబ్బులు తీసుకుంటున్నారు. పింఛన్లకు రూ.వెరుు్య, అంత్యోదయ కార్డుకు రూ.3 వేల చొప్పున సర్పంచ్ భర్త వసూలు చేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే కార్డులు అంటూ వచ్చిన కాడికి తీసుకుంటున్నాడు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement