ముఖ్యమంత్రి దగ్గర తల దించుకుంటా, కానీ.. : జగ్గారెడ్డి | Sangareddy MLA Jagga Reddy Speaks to the Media in Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి దగ్గర తల దించుకుంటా, కానీ.. : జగ్గారెడ్డి

Oct 13 2019 3:29 PM | Updated on Oct 13 2019 3:37 PM

Sangareddy MLA Jagga Reddy Speaks to the Media in Gandhi Bhavan - Sakshi

మాట్లాడుతున్న సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : నియోజకవర్గ ప్రజల కోసం సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ముందు తల దించుకుంటా కానీ హైదరాబాద్‌ వస్తే మాత్రం ప్రజా సమస్యలపై తల ఎత్తి ప్రశ్నిస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తనదైన శైలిలో మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని... అతని కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను నేడు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగి లోపం ఎక్కడుందో గుర్తించాలని జగ్గారెడ్డి సూచించారు. కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రిని ఒప్పించకుంటే రవాణాశాఖ మంత్రి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందని, ఎవరిని మిగిల్చారని ప్రశ్నించారు. సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతునిస్తుందని, అవసరమైతే కోర్టుకు వెళతామని కార్మికులకు భరోసా ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement