కొత్త జిల్లాల్లోనే ఆర్టీఏ స్లాట్ల బుకింగ్ | RTA Booking slots at New Districts | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల్లోనే ఆర్టీఏ స్లాట్ల బుకింగ్

Oct 6 2016 1:37 AM | Updated on May 24 2018 1:57 PM

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త కార్యాలయాల ఏర్పాటుపై రవాణా శాఖ దృష్టి సారించింది.

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త కార్యాలయాల ఏర్పాటుపై రవాణా శాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం ఆర్టీఏ సేవలన్నీ ఆన్‌లైన్ ద్వారానే అందిస్తున్నందున వినియోగదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి సేవలు పొందే తేదీ (స్లాట్) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దీనికోసం కొత్త స్లాట్లను ఆయా కొత్త జిల్లాలకే బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నెల 11 వరకు భవిష్యత్తు తేదీల కోసం బుక్ చేసుకున్న స్లాట్లను కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. అంటే.. 12వ తేదీ నుంచి కొత్త జిల్లాల వారు తమ సేవలను కొత్త జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల ద్వారానే పొందాల్సి ఉంటుంది. యథావిధిగా కొనసాగే పాత జిల్లాల వారు మాత్రం ప్రస్తుత కార్యాలయాల్లోనే సేవలు పొందుతారు. కొత్త జిల్లాకు చెందిన వారెవరైనా నిర్ధారిత తేదీన స్లాట్ పొందలేకపోతే వారు మరో రోజు దాన్ని పొందే వెసులుబాటు కల్పించారు. కార్యాలయాలు, స్లాట్లు, మారితే కొత్త తేదీలు.. తదితర వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేసిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో తెలుపుతామని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement