అంతా ఊపిరి పీల్చుకున్నారు | Road Accident In Mahabubnagar District Rtc Bus | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

Apr 7 2018 12:11 PM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Mahabubnagar District Rtc Bus - Sakshi

ఆర్టీసీ బస్సును రోడ్డుపైకి ఎక్కిస్తున్న ప్రయాణికులు

మద్దూరు : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ముంబాయికి వెళ్లే బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నారాయణపేట నుంచి మద్దూరు మీదుగా ముంబాయికి వెళ్లే ఆర్టీసీ బస్సు మద్దూరు బస్టాండ్‌కు చేరింది. పాతబస్టాండ్‌ మీదుగా వెళ్లాల్సిన బస్సు పాతబస్టాండ్‌లోమిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు జరుగుతుండడంతో ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వెళ్లడానికి బస్సుడ్రైవర్‌ బస్టాండ్‌లో సీసీ రోడ్డుపైకి బస్సును ఎక్కించే ప్రయత్నం చేశారు. సీసీ రోడ్డు వారం రోజుల క్రితమే వేయడంతో క్యూరింగ్‌ కోసం కట్టలు కట్టారు. దీంతో బస్సు అదుపుతప్పి బొల్తా పడబోయింది. బస్సు డ్రైవర్‌ ప్రయాణికులు గమనించడంతో బస్సును అపి అందులోని ప్రయాణికులను దింపేశారు. బస్సును సీసీ రోడ్డుపైకి తోశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement