Sakshi News home page

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెంకట్

Published Thu, Dec 25 2014 1:04 AM

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెంకట్

చిట్యాల : 2015, జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి భవన్ ఎదుట జరిగే పరేడ్‌కు కుందనపల్లి గ్రామానికి చెందిన మాడుగుల వెంకట్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వెంకట్ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. ఈ క్రమం లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మొ దటిసారిగా యూనివర్సిటీ స్థాయిలో వలంటీర్లను కవాతు కోసం ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అక్టోబర్ 11 నుంచి 22 వరకు వీరికి శిక్షణ ఇచ్చారు. గుజ రాత్, మహారాష్ట్ర, గోవా, దాద్రనగర్ హవేళి, డయ్యూడామన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 200 మంది శిక్షణ పొందారు. అందులో 40 మందిని పరేడ్‌కు ఎంపిక చేశా రు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురిని ఎం పిక చేయగా.. వరంగల్ జిల్లా నుంచి తాను ఒక్కడినే పరేడ్‌కు ఎంపికైనట్లు వెంకట్ తెలిపా డు. ఢిల్లీలో జనవరి 1 నుంచి 25 వరకు కవా తు ప్రాక్టీస్ చేసి 26న రాష్ట్రపతి భవన్ ఎదుట ప్రదర్శన ఉంటుందని తెలిపాడు. కాగా, పరేడ్‌కు ఎంపికైన వెంకట్‌ను ఓయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి.రెడ్యానాయక్, నిజాం కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీధర్, కోచ్ డాక్టర్ రవితేజ అభినందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement