కేసీఆర్ మాటల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీలేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ విమర్శించారు.
‘మాటల గారడీ తప్ప చేసిందేమీ లేదు’
Sep 8 2017 4:22 PM | Updated on Aug 15 2018 8:12 PM
పాల్వంచ: కేసీఆర్ మాటల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీలేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌దేనన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
Advertisement
Advertisement