సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టెంపరరీ రికగ్నైజేషన్ (ఈటీఆర్) గుర్తింపు ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ కమిషనర్ కిషన్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షల సమయం నాటికి గుర్తింపులేని స్కూళ్లు అనేవే లేకుండా, ముందుగానే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో 12 స్కూళ్లకు సంబంధించిన ఈటీఆర్‌ల విషయంలో ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన సిబ్బందిపై కేసులు నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌లో ఇంటి అడ్వాన్స్‌ల విషయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి రుణం తీసుకున్న సిబ్బంది విషయంలోను విచారణ జరుపుతున్నామన్నారు.
ఏప్రిల్ నెలాఖరులోగా పాఠశాలల గుర్తింపు
Mar 14 2018 3:43 AM | Updated on Mar 14 2018 3:43 AM
Advertisement
Advertisement