పుష్కర సైడ్‌లైట్స్ | Pushkarni Side Lights | Sakshi
Sakshi News home page

పుష్కర సైడ్‌లైట్స్

Jul 25 2015 1:56 AM | Updated on Sep 3 2017 6:06 AM

పుష్కరాల ముగింపు ఒక్క రోజే మిగిలి ఉంది. శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పుష్కరాల ముగింపు ఒక్క రోజే మిగిలి ఉంది. శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని మంగపేట, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కరఘాట్లు కిక్కిరిపిసోయూరుు. 11వ రోజు పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు క్లుప్తంగా..
   
 ►గోదారి ప్రవాహం పెరిగింది. గతంలో ఏర్పాటు చేసి న కంచెలు కొట్టుకపోయాయి. శుక్రవారం మంగపే ట ఘాట్ వద్ద పోలీసులు, అధికారులు కాపాల ఉన్నారు.
      
 ►గోదావరి ఉప్పొంగడంతో భక్తుల కోసం వేసిన టెంట్లు నీటిలో నానిపోయూరుు. దీంతో భక్తులు నిలుచోడానికి, పిండ ప్రదానాలు చేయడానికి నీడ కరువైంది.
     
 ►కళాకారుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూలిపోరుుంది. అదే టెంట్ కింద శుక్రవారం ప్రదర్శనలు కొనసాగారుు.
      
 ►గోదావరి నదీ తీరంలో దొరికే గులక రాళ్లను భక్తులు తమ ఇంటికి తీసుకెళ్తూ కనిపించారు.
 

 ►మంగపేట ఘాట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల ద్వారా ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, ములుగు ఆర్డీవో మహేంద్రజీలు భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
      
 ►మంగపేట పుష్కర ఘాట్‌పై ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు
     
 ►పుష్కరసమాచారాన్నిఉన్నతాధికారులకుచేరవేశారు.
  
 ►మంగపేట ఘాట్‌వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో  చాలామంది షవర్ల కింద స్నానాలు ఆచరించారు.
 
 ►రెండు రోజులుగా కురిసిన వర్షాలతో గుంతల్లో భారీగా నీరు చేరింది. భక్తులు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది పడ్డారు.
     
 ►పుష్కర స్నానాలు ఆచరించినవారు గోదావరి నీటిని బాటిళ్లు, టిన్నుల్లో ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. పుష్కర నీటిని ఇళ్లలో నిల్వ ఉంచితే శుభసూచకమని చెప్పారు.
      
 ►మంపేటలో భక్తులు తిరుగు ప్రయూణంలో ఇబ్బంది పడ్డారు. వృద్ధులు సుమారు 2 కిలోమీటర్ల పొడువు నడవలేక అవస్థలుపడ్డారు.
      
 ►రామన్నగూడెం గోదావరి నదిలో మహిళలు వేసిన రవిక ముక్కలను కొందరు సేకరించడం కని పించింది.
 
 ►మంగపేటలో సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చిత్రపటానికి ధరావత్ మోహన్‌గాంధీనాయక్ క్షీరాభిషేకం చేశారు.
 
 ►మాజీ డిప్యూటీ సీఎం తాటి కొండ రాజయ్య మంగపేట పుష్కరఘాట్ వద్ద పుష్కరస్నానం చేశారు. గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించారు.
 -ఏటూరునాగారం/ములుగు/మంగపేట/
 ఎస్‌ఎస్‌తాడ్వారుు
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement