గిరిజనుల అభివృద్ధికి కృషి

 Provide Irrigation Water For Agriculture Only In  TRS Governament  - Sakshi

మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు 

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): గిరిజనుల అభివృద్ధికి కృషి చేశానని  తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం గఢ్‌పూర్, ర్యాలీ, నాగారం, చిన్నగోపాల్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గిరిజన గ్రామాలను మరింత∙అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రైతాంగానికి సాగునీరు అందిచామని వివరించారు. 

అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెటామన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొమ్మాటి సత్తయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సాగి వెంకటేశ్వర్‌రావు, నాయకులు దొమ్మాటి లచ్చన్న, కోవ రాజు, శ్రీనివాసరావు, రఫీ, గిరిజనులు పాల్గొన్నారు.  

నస్పూర్‌లో విజిత్‌రావు ప్రచారం.. 
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు నస్పూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీగల్‌పహడ్‌ పరిధిలోని రాంనగర్, సీసీసీ కార్నర్‌తో పాటు శ్రీరాంపూర్‌లో టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేలేటి కిష్టయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డీకొండ అన్నయ్య, వేల్పుల రవీందర్, ముత్తె రాజేశం, ముక్కెర వెంకటేశ్, నొముల నరేందర్‌రెడ్డి, జాడీ బానుచందర్, కిరణ్‌ పాల్గొన్నారు.   

కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. 
అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నడిపెల్లి దివాకర్‌రావును గెలిపించాలని మంచిర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మామిడిశెట్టి వసుంధర అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్టు చైర్మన్‌ నడిపెల్లి విజిత్‌కుమార్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నల్ల శంకర్, పెండ్లి అంజయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పెంట రాజయ్య, కౌన్సిలర్‌ కారుకూరి చంద్రమౌళి, గడప రాకేశ్, పల్లె భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 గఢ్‌పూర్‌లో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న స్థానికులు 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top