
ప్రాజెక్టులకు పెద్దపీట
జిల్లాలో ఉన్న మూడు భారీ సాగునీటి ప్రజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గద్వాల: జిల్లాలో ఉన్న మూడు భారీ సాగునీటి ప్రజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిధుల కొరత లేకుండా ఏడాదిలోగా పూర్తిచేసి ఆయకట్టుకు నీళ్లందించాలని సంకల్పించింది. అవసరరం మేరకు రూ.698కోట్లు విడుదల చేయాలని భావించింది. ఈ మేరకు ఈనెల 12న హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు సాగునీటి పారుదలశాఖ ఇంజనీర్లు తెలిపారు.
ఈనెల 17వ తేదీ నుంచి సీఎం ప్రాజెక్టుల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో అప్పటిలోగా జిల్లా సాగునీటి ప్రాజెక్టుల వివరాలు, నీటి లభ్యత, అవసరమైన నిధులు, ఎదురయ్యే అడ్డంకులపై పూర్తిస్థాయి సమాచారంతో ఫైళ్లను సిద్ధంచేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో మూడు ఎత్తిపోతల పథకాలను జాతికి అంకితం చేసినా ఇప్పటివరకు ఆయకట్టుకు నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వంలో అవసరం మేరకు నిధులు కేటాయించి ఏడాదిలోగా పనులు పూర్తిచేస్తే కొత్తగా ఏడులక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు లక్షల ఎకరాల ఆయకట్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డలో రెండు లక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు పరిధిలో రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించే విధంగా పనులు పూర్తిచేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి..
ఈ పథకం నుంచి ఇప్పటివరకు రెండేళ్లుగా వేసవిలో చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టుకు అవసరమైన నీటి విడుదల ఉన్నప్పటికీ ఫీడర్‌ఛానల్స్ లేకపోవడంతో చెరువులకే పరిమితమైంది. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి మల్దకల్, ధరూరు, గద్వాల మండలాల్లోని చెరువులకు నీటిని నింపడమే సరిపోయింది. ఈ ఖరీఫ్‌లో రెండు రిజర్వాయర్ల ద్వారా కనీసం 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
ప్రస్తుత పరిస్థితి
1998లో అప్పటి ప్రభుత్వం భీమా మొదటిదశకు రూ.141 కోట్లతో మంజూరు ఇచ్చింది. ఇదే ప్రాజెక్టును వైఎస్ ప్రభుత్వం జలయజ్ఞంలో చేర్చి రెండు లక్షల ఎకరాల లక్ష్యంతో స్టేజ్-2ను అదనంగా చేర్చింది. భీమా నది నుంచి మొదటిదశలో లక్షా 11వేల ఎకరాలు, రెండో దశలో జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వలో భాగమైన రామన్‌పాడు రిజర్వాయర్ ఊక చెట్టు వాగు ద్వారా 92వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూ.3584 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. మొత్తం 20 టీఎంసీల నీటిని వాడుకోవడానికి సీడబ్ల్యూసీ అనుమతిచ్చింది.
ప్రస్తుత పరిస్థితి..
ఈ పథకాన్ని జాతికి అంకితం చేసి ఏడాదిన్నర గడిచినా కేవలం 13వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించగలిగారు. లిఫ్టు-1, లిఫ్టు-2, లిఫ్టు-3లో పనులను ఒక్క లిఫ్టులో మాత్రమే పూర్తిచేసి మిగతావాటిని వేగవంతం చేయలేకపోయారు. లిఫ్టు-2 పనులను పూర్తిచేసింటే 43వేల ఎకరాలకు సాగునీటిని అందుబాటులోకి తెచ్చేవారు. లిఫ్టు-3లో 2లక్షలా 84వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్నది లక్ష్యం. లక్ష్యాలు భారీగానే ఉన్నా పనులు పూర్తిచేయడంలో శ్రద్ధచూపడం లేదు.