ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Private Travels Bus Catches Fire At Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ: నల్గొండలో పెను ప్రమాదం త్రుటిలో తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్కూట్‌తో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top