దిశ నిందితులకు సండే స్పెషల్‌

Prison Officials Who Provided Carnivorous Meals To The Accused - Sakshi

ఆదివారం మాంసాహార భోజనం అందించిన జైలు అధికారులు

కుషాయిగూడ: వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్య కేసులో అరెస్టయి..చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులకు జైలు అధికారులు సండే స్పెషల్‌ రుచి చూపించారు. జైలులోని మహానంది బ్యారక్‌లో వేర్వేరు గదుల్లో ఉన్న నిందితులు మహమ్మద్‌ బాషా, బొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్‌కుమార్‌లకు జైలు అధికారులు ఆదివారం ఉదయం పులిహోర, మధ్యాహ్నం సాధారణ భోజనం, రాత్రి మాంసాహారం అందజేశారు. జైల్లో కూడా వారిపై దాడి జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆయా బ్యారక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం కూడా బ్యారక్‌ల వద్దకే పంపారు. వారు ఇంకా షాక్‌ నుంచి కోలుకోలేదని, తప్పు చేశామనే పశ్చాత్తాపం వారిలో కన్పిస్తోందని జైలు అధికారులు తెలి పారు. జైల్లోని ఇతర ఖైదీలు దాడి చేసే అవకాశం ఉండటంతో పాటు షాక్‌లో ఉన్న నిందితులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం కూడా ఉందని, అందుకే వారిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు జైలు అధికారులు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top