నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించిన ఓ గర్భిణి వైద్యం అందిస్తుండగానే మృతి చెందింది.
జైపూరు (ఆదిలాబాద్ జిల్లా) : నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించిన ఓ గర్భిణి వైద్యం అందిస్తుండగానే మృతి చెందింది. ఈ సంఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ కాలేజీలో జరిగింది. వివరాల ప్రకారం.. జైపూర్ మండలం గూషిమెట్టక్యాంప్ గ్రామానికి చెందిన మీరాబాయి(21) తొమ్మిదినెలల గర్భవతి.
కాగా గురువారం నొప్పులు రావడంతో ఆమెను వెంటనే 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ప్రసూతి కాకుండానే మహిళ మృతి చెందింది. దీంతో కడుపులో ఉన్న బిడ్డ కూడా మృతి చెందినట్లు సమాచారం.