అకాల వర్షం.. తడిసిన ధాన్యం | Precocious rain drenched the grain .. | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

Apr 25 2014 3:13 AM | Updated on Oct 1 2018 2:44 PM

అకాల వర్షం.. తడిసిన ధాన్యం - Sakshi

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

జనగామలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. ఆరు గాలం కష్టించి.. పండించిన పంట చేతికొచ్చిన దశలో కురిసిన వర్షం రైతుల ఆశలను అడియూసలు చేసింది.

జనగామలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. ఆరు గాలం కష్టించి.. పండించిన పంట చేతికొచ్చిన దశలో కురిసిన వర్షం రైతుల ఆశలను అడియూసలు చేసింది. విక్రయూనికి సిద్ధంగా ఉన్న దశలో రైతుల కంట కన్నీరు పెట్టించింది. వారం రోజులుగా జనగామ డివిజన్‌లో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు పెద్ద ఎత్తున ధాన్యపు బస్తాలను తీసుకొస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ధాన్యం బస్తాలతో రైతులు రోజుల తరబడి అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

ఈ క్రమంలో కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యూర్డు బయట ఉన్న సుమారు 30 వేల బస్తాలు తడిసిముద్దయ్యూరుు.  కాగా, వర్షంతో పట్టణ రోడ్లు  జలమయమయ్యాయి. ఈదురుగాలులకు బస్టాండ్ వెనుక విద్యుత్ వైర్లు తెగిపడడంతో  రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.   - న్యూస్‌లైన్, జనగామటౌన్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement