ప్రజల ఆదరణను మరువలేను | Ponguleti Srinivasa Reddy birthday celebrations | Sakshi
Sakshi News home page

ప్రజల ఆదరణను మరువలేను

Oct 29 2014 4:09 AM | Updated on May 25 2018 9:17 PM

ప్రజల ఆదరణను మరువలేను - Sakshi

ప్రజల ఆదరణను మరువలేను

నాపై ప్రజలు చూపుతున్న ఆదరణను జీవితాంతం మరిచిపోలేను.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. 48వ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో 48 కిలోల కేక్‌ను పొంగులేటి కట్ చేశారు.    
 
సాక్షి, ఖమ్మం:  ‘‘నాపై ప్రజలు చూపుతున్న ఆదరణను జీవితాంతం మరిచిపోలేను. బతికున్నంత కాలం ప్రజాసేవ చేస్తా..’’ అని, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన 48వ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా ఏర్పాటు చేసిన 48 కిలోల కేకును పొంగులేటి కట్ చేశారు.

ఆయనకు పార్టీ శ్రేణులు పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు తెలిపి, పూల వర్షం కురిపించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎన్నో ప్రతికూల పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నా జన్మదిన వేడుకల నిర్వహణకు విముఖత వ్యక్తం చేశాను. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే ఈ వేడుకలకు హాజరయ్యాను’’ అని చెప్పారు. తనపై ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మరువలేనని, వారికి అండగా ఉంటూ వైఎస్‌ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ వేడుకల్లో పార్టీ యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కూరాకుల నాగభూషణం (ఖమ్మం), డాక్టర్ గుగులోతు రవిబా బు నాయక్ (ఇల్లెందు), బొర్రా రాజశేఖర్ (వైరా), జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, నగర అధ్యక్షుడు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి కోటేశ్వరరావు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపెట వెంకటేశ్వర్‌రావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, నాయకులు షర్మిలాసంపత్, కొంగర జ్యోతిర్మయి, నగర అధికార ప్రతినిధులు హెచ్.వెంకటేశ్వర్లు, సకీనా, రఘునాధపాలెం మండల అధ్యక్షుడు దుంపటి నగేష్, టేకులపల్లి మండల అధ్యక్షుడు నర్సింగ్ లక్ష్మయ్య, ఇల్లెందు పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియల్, నాయకులు తుమ్మా అప్పిరెడ్డి, మందడపు రామకృష్ణారెడ్డి, కీసర వెంకటేశ్వరరెడ్డి, సూతగాని జైపాల్, మందడపు వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి సైదులు, మార్కం లింగయ్య గౌడ్, పత్తి శ్రీనివాస్, పగడాల భాస్కర్ నా యుడు, దామోదర్‌రెడ్డి, జంగాల శ్రీను, శ్రీదే వి, ప్రియదర్శిని, వాలూరి సత్యనారాయణ, దుంపల రవికుమార్, మైపా కృష్ణ, సుగ్గల కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అన్నదానం
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి ఆధ్వర్యంలో రాపర్తినగర్ బైపాస్ రోడ్డులోని అర్బన్ డిప్రైర్ రెసిడెన్షియల్ స్కూల్ (ప్రణతి సోషల్ సర్వీస్ సొసైటీ)లో విద్యార్థులకు అన్నదానం జ రిగింది. కార్యక్రమంలో ఎంపీ సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు తుం బూరు దయాకర్‌రెడ్డి, బండి సత్యం, టేకులపల్లి మండల అధ్యక్షుడు నర్సింగ్ లక్ష్మణ్, చౌటపల్లి సర్పంచ్ రవి, నాయకులు అబ్దుల్లా, ఫిరోజ్, సందీప్, కిషోర్, సుజాన్, నాయక్, అన్వర్, గన్ను, సజ్జీల్, అఖిల్, కేరాల విద్యాధర్, రాజేష్, రాకేష్, అలీల్, సాయి, మాలిక్, లకన్ పాల్గొన్నారు.

మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ
ఎన్నెస్పీ క్యాంపులోని మదర్ థెరిస్సా మానసిక వికలాంగుల కేంద్రంలో మానసిక వికలాంగుల మధ్య ఎంపీ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ జిల్లా నాయకుడు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేకును ఎంపీ  కట్ చేశారు. మానసిక వికలాంగులకు పండ్లు, స్వీట్లు పంపిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీ సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, బివి.రమణ, ఫసియుద్దీన్, తంగెళ్ల ఉపేందర్, వికలాంగుల కేంద్రం కార్యదర్శి పి.వనజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement