భారీగా నకిలీ విత్తనాల పట్టివేత | police seizes Fake seeds | Sakshi
Sakshi News home page

భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

Jun 12 2017 7:54 PM | Updated on Sep 5 2017 1:26 PM

శంషాబాద్‌లోని ఆర్బీనగర్ లో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల..

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని ఆర్బీనగర్ లో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ. కోటి తొమ్మిది లక్షల విలువజేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రవికుమార్‌, శ్రీనివాస్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో పది మంది నిర్వాహకులు పరారయ్యారని, రెండు కార్లు, ఒక డీసీఎం  స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్‌ డీసీపీ పద్మజా తెలిపారు.



 

Advertisement
 
Advertisement
Advertisement