చిట్టీల పేరుతో కోటి రూపాయలు టోపీ | one crore chits fraud | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో కోటి రూపాయలు టోపీ

Mar 17 2015 3:55 PM | Updated on Mar 28 2018 11:08 AM

చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర కుచ్చు టోపీ పెట్టిన ఘటన మంగళవారం వెలుగు చూసింది.

 హైదరాబాద్ : చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర కుచ్చు టోపీ పెట్టిన ఘటన  హైదరాబాద్ లో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోటేశ్వర్‌రావు చిట్టీల పేరుతో దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోటేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement