కాగుతున్న వంట నూనె

Oil Prices Hikes in Sankranthi Festival Season - Sakshi

నగరంలో భగ్గుమంటున్న ధరలు  

లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 పెంపు

సాక్షి సిటీబ్యూరో: సంక్రాంతి పండగ ఎఫెక్ట్‌ రైళ్లు, బస్సులనే కాదు.. వంట నూనెనూ తాకింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు, బస్సుల టికెట్‌ ధరలు పెంచినట్టే ప్రయాణికు వంట నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. నగరంలో రోజుకు వందల టన్నులకు పైగా వంట నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. హోటల్స్, క్లబ్బులు, బార్లలో వంటలకు అత్యధికంగా వివిధ రకాల నూనెలు వినియోగిన్నారు. ఇక ఇళ్లలో కూడా నూనె వినియోగం పెరిగింది. ప్రస్తుతం సంక్రాంతి పండగ కాడంతో నగరంలో వంట నూనె వినియోగం మూడింతలు పెరిగింది. దీంతో నూనె ధరలు భగ్గుమంటున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో అన్ని రకాల నూనెపై లీటర్‌కు రూ. 3 నుంచి రూ. 5 పెరిగింది. ఇక రిటైల్, బహిరంగ మార్కెట్‌లో ప్రతి లీటరు నూనెపై రూ.10 నుంచి రూ.12 పెంచారు. 

నూనె ఏదైనా ‘ధరా’ఘాతం  
పామాయిల్, రిఫైండ్‌ ఆయిల్, వేరుశనగ, రైస్‌బ్రాన్‌ నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెకు సంబంధించి హోల్‌సేల్‌ ధరలకూ, రిటైల్‌ మార్కెట్‌లో ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో పామాయిల్‌ 10 కిలోల ధర రూ.650 నుంచి రూ.750కు చేరింది. రిటైల్‌ మార్కెట్‌లో కిలో ధర రూ.85కు పెరిగింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో 15 కేజీల ధర రూ.1350 నుంచి రూ.1400 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.1450కు చేరింది. రిటైల్‌ మార్కెట్‌లో కిలో ధర రూ.95 నుంచి రూ.97కు పెరిగింది. కిలో వేరుశనగ నూనె ధర నెలక్రితం రూ.98 ఉండగా ప్రస్తుతం రూ.105కు చేరింది. వీటితోపాటు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ రూ.87 నుంచి రూ.92కు పెరిగింది. ఈ స్థాయిలో వంట నూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు చెబుతున్నారు.  వంటనూనెపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. గోడౌన్లలో దాచిన పాత సరుకుని ఇప్పుడు బయటకు తీసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇదే అకాశంగా కొందరు వ్యాపారులు కల్తీకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top