
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శిల్పులు అష్టభుజి మండపాన్ని పూర్తి చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్తపతి ఆనందవేలు పర్యవేక్షణలో దీనిని నిర్మించారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజ గోపురాలను కలుపుతూ ఈ అష్టభుజి మండపాన్ని నిర్మించారు. పనులు పూర్తికావడంతో మండపం భక్తులకు కనువిందు చేస్తోంది.