ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ | Nominations Process In Kodada | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

Nov 13 2018 12:28 PM | Updated on Apr 4 2019 2:50 PM

Nominations Process In Kodada - Sakshi

బందోబస్తును పరిశీలిస్తున్న డీఎస్పీ

సాక్షి,కోదాడ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా సోమవారం ప్రారంభమయ్యింది. అధికారులు దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంగా మార్చారు. కోదాడ అసెంబ్లీ ని యోజకవర్గానికి చెందిన నామినేషన్లను ఇక్కడే స్వీకరించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా కోదాడ ఆర్డీఓ కిషోర్‌కుమార్‌ను నియమించారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం కోదా డ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాసుల రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. 
తొలిరోజు ఒక నామినేషన్‌ దాఖలు..
కోదాడ అసెంబ్లీకి తొలిరోజు ఒక నామినేషన్‌ దాఖలయ్యింది. పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాల ఐక్యవేదిక నాయకుడు పంది పెదతిరపతయ్య సోమవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement