నరేశ్, స్వాతి కేసులో పోలీసు అధికారులపై చర్యలు | Naresh, Swati's case against police officers | Sakshi
Sakshi News home page

నరేశ్, స్వాతి కేసులో పోలీసు అధికారులపై చర్యలు

Jun 1 2017 12:52 AM | Updated on Nov 6 2018 8:08 PM

కులాంతర వివాహం చేసుకున్న ఆత్మకూర్‌(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలకు చెందిన నరేశ్‌ హత్య, స్వాతి ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన

సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న ఆత్మకూర్‌(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలకు చెందిన నరేశ్‌ హత్య, స్వాతి ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధి కారులపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ చర్యలు తీసుకున్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి, భువనగిరి ఏసీపీ సాదు మోహన్‌రెడ్డిలకు మెమోలు, రామన్నపేట సీఐ శ్రీనివాస్, భువనగిరి పట్టణ సీఐ శంకర్‌గౌడ్‌లకు చార్జ్‌ మెమోలు ఇచ్చారు. ఆత్మకూర్‌(ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. అదే విధంగా మోత్కూరు ఎస్‌ఐ కె.రవికుమార్‌ భూ వివాదంలో రూ.40వేలు డిమాండ్‌ చేయడంతో సీపీ సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement