ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ‘రం గోళీ’ అభ్యర్థులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
అభ్యర్థుల నుంచి నేరుగా ఇనామ్‌లు
చిక్కడు, దొరకడు విధంగా వ్యవహరిస్తున్న అభ్యర్థులు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ‘రం గోళీ’ అభ్యర్థులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. హోలీకి ఎన్నికల రంగు పులుముకుంటోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వా ర్డుల్లో ప్రధానంగా హోలీ ఇనామ్‌ల పేరిట అ భ్యర్థులు వేలు ఎగజిమ్ముతున్నారు. ఇందులో ప్రధానంలో డ్వాక్రా మహిళలు, యువత...ఇతరాత్ర సంఘాల నాయకులకే ఎక్కువగా ఇ నామ్‌లు అందుతున్నాయి. హోలీ వస్తుదంటే చాలు పల్లె ప్రాంతాల్లో మహిళలు..యువకులు..కాస్తకారులకు ఇనామ్‌ల పేరిట డబ్బులు..ధాన్యాలు పంచుతుండేవారు.
అయితే ము న్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఇదే అదును గా భావించి హోలీకి ఎన్నికల రంగు పులుముతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, సంఘాల నాయకులకు ముందస్తుగా స మాచారం అందించి డబ్బులు పంచుతున్నా రు. ఇనామ్‌ల కోసం పట్టణంలోని పలు పార్టీ ల నాయకుల ఇళ్ల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు,యువకులు పడిగాపులు కాస్తున్నారు.
సంప్రదాయానికి ఎన్నికల రంగు
అనాదిగా జరుపుకుంటు వస్తున్న హోలీ పర్వదినానికి ఎన్నికల రంగు అంటుకుంటుంది. ఇనామ్‌ల పేరిట అభ్యర్థుల ఇళ్లలో పెద్దసంఖ్య లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం. ఇ టీవల ఒక వ్యక్తి ఇంట్లో పలువురు మహిళలు హోలీ ఇనామ్ కోసం వెళ్లి డబ్బులు తీసుకున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే సంప్రదా యం ముసుగులో కాలనీల్లో తిరుగుతూ యు వతకు కావాల్సిన వస్తువులు.. డబ్బులు అంది స్తూ..ఓటు వేయించాలని ప్రచారం చేస్తున్నా రు. ఈ తతంగం రాత్రి వేళల్లో ఎక్కువ జరుగుతోంది.
ఈ విధానంతో ఎన్నికల కోడ్‌తోపాటు తమ లక్షలోపు ఖర్చు పెట్టాలనే నిబంధన నుంచి సులువుగా అభ్యర్థులు తప్పించుకునే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అభ్యర్థులను అధికారులు పట్టుకోవాలంటే ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది.