
ఆలయంలో ఎంపీ వినోద్ కుటుంబ సభ్యులు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వినోద్ కుటుంబసభ్యులు..
ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయా రు అమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు చేశా రు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.