భర్త అనుమానం.. భార్య దారుణం

Mother Throws Baby On Road In Mehdipatnam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మెహదీపట్నం ఫ్లైఓవర్‌ సమీపంలో గల బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి కలకలం రేగింది. అక్రమ సంబంధం పేరిట భార్యను భర్త అనుమానించడంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బిడ్డ తనకు పుట్టలేదంటూ అనుమానిస్తున్నాడని  తన భర్తతో నడిరోడ్డుపైనే ఘర్షణకు దిగింది. భర్తపై కోపంతో తన చేతిలోని చిన్నారిని రోడ్డుపై పడేసింది. తనపై కోపం చిన్నారిపై చూపడమేంటని భర్త ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇదంతా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల కంటబడింది. పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. గొడవ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top