ఆరుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి | Mother of his six children to drink Pesticides, he committed suicide | Sakshi
Sakshi News home page

ఆరుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి

Oct 20 2014 4:54 AM | Updated on Oct 8 2018 5:04 PM

ఓ తల్లి తన ఆరుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించింది.

తానూ తాగి ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ క్రైం: ఓ తల్లి తన ఆరుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్‌లో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. ఖాసీం, ఖాజాబేగం దంపతులకు ఆరుగురు సంతానం. కొద్దిరోజులుగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఖాజాబేగం తన ఆరుగురు పిల్లలు మైమూదా, అభిదా, సబా, షాహీన్, మస్తాన్, నవాజ్‌లకు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగించింది. కొద్దిసేపటి తరువాత తాను కూడా తాగింది. ఇది గమనించిన స్థానికులు చికిత్సకోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చిన్నారులు మస్తాన్(2), నవాజ్(7) ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement