వాగులో పడి తల్లీకూతుళ్లు మృతి | mother and doughter dies after fall in tank in warangal district | Sakshi
Sakshi News home page

వాగులో పడి తల్లీకూతుళ్లు మృతి

Jun 17 2015 8:18 PM | Updated on Apr 3 2019 8:07 PM

పనిమీద పొరుగూరికి వెళ్తున్న తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెందిన సంఘటన జిల్లాలోని రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

వరంగల్: పనిమీద పొరుగూరికి వెళ్తున్న తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెందిన సంఘటన జిల్లాలోని రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు ఆముదాల రాజమల్లమ్మ(60), వనిత(32) కాలినడకన గ్రామం నుంచి కనిపర్తికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న చలివాగు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇసుక గుంటలో పడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement