సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రొత్సహించేందుకు నాబార్డు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫండ్ (ఎఫ్‌ఐఎఫ్) ద్వారా మొబైల్ ఏటీఎం వ్యాన్లు కొనుగోలు చేశామని టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టీఎస్‌ఎస్సీఏబీ) ఉన్నతాధికారులు వ్యాన్ల తాళాలను డీసీసీబీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు అందజేశారు.
ఈ వ్యాన్లు హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సంచరిస్తాయన్నారు. సమావేశంలో నాబార్డ్ సీజీఎం రాధాకృష్ణ, టీస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్, టీ స్కాబ్ సీబీఎం జ్యోతి పాల్గొన్నారు.
‘ఆర్థిక ప్రోత్సాహానికి మొబైల్ ఏటీఎంలు’
May 22 2018 1:11 AM | Updated on May 22 2018 1:11 AM
Advertisement


