‘సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ భేష్’ | ministger mahendar reddy visits rangareddy district | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ భేష్’

Jun 27 2016 12:35 PM | Updated on Mar 28 2018 11:26 AM

ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే పేరుతెచ్చుకుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.

యాప్రాల్: ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే పేరుతెచ్చుకుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌లోని కిందిబస్తీలో సోమవారం ఉదయం ఆయన మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 120 ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించినట్లు వివరించారు. జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు రూ.180 కోట్లతో 9 పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షాదీముబారక్ పథకం కింద జిల్లాకు చెందిన 5,700 మంది యువతుల పెళ్లిళ్లకు రూ.51వేల చొప్పున అందజేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement