సమ్మెపై మంత్రి ఆగ్రహం.. కుట్రవారిదే! | Minister Talasani Srinivas Fires On RTC Employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఆగ్రహం.. కుట్రవారిదే!

Oct 5 2019 4:28 PM | Updated on Oct 5 2019 4:36 PM

Minister Talasani Srinivas Fires On RTC Employees - Sakshi

సాక్షి, సంగారెడ్డి: దసర పండుగ ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరైనది కాదని కార్మికులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆర్టీసీ కార్మికులకు అత్యధిక జీతాలు ఇచ్చేది తామేనని పేర్కొన్నారు. ఎక్కడాలేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44  శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, 16 శాతం ఐఆర్  కూడా ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి..  బతుకమ్మ, దసరా పండుగలోస్తే సమ్మె చెస్తామంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు వేల కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని.. ఏటా 11 వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కార్మికులు రోజుకో డిమాండ్‌ చేయాటాన్ని మంత్రి తప్పుపట్టారు. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేవని, యూనియన్ లీడర్లే కుట్రపూరితంగా ఈ సమ్మె చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement