ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే... | minister pocharam srinivasa reddy slams tdp,congress | Sakshi
Sakshi News home page

ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే...

Oct 18 2014 1:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలో విద్యుత్ కొరత పాపం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలదేనని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

నిజామాబాద్ : తెలంగాణలో విద్యుత్ కొరత పాపం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలదేనని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన శనివారం బాన్సువాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బొగ్గు లేని సీమాంద్రలో థర్మల్ విద్యుత్ ఫ్లాంట్లకు విద్యుత్ తరలించుకుపోతే ఇక్కడి నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రానున్న మూడేళ్లలో విద్యుత్ కొరతలు లేకుండా చూస్తామని పోచారం హామీ ఇచ్చారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పోచారం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రైతుల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement