సంగీతకు మంత్రి సన్మానం | Minister Harish Rao Honor Sangeetha | Sakshi
Sakshi News home page

సంగీతకు మంత్రి హరీశ్‌రావు సన్మానం

Apr 2 2018 10:40 AM | Updated on Aug 30 2019 8:37 PM

Minister Harish Rao Honor Sangeetha - Sakshi

సంగీతను సన్మానిస్తున్న మంత్రి హరీశ్‌రావు

రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అర్బన్‌ ప్లానర్‌ పుల్లూరి సంగీతను మంత్రి హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. పుల్లూరి సంగీత 11 స్మార్ట్‌ సిటీలకు అర్బన్‌ ప్లానర్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల ఇండియాలో మొదటి ఉత్తమ మున్సిపాలిటీగా సిద్ధిపేటను తీర్చిదిద్దటం, స్వచ్ఛభారత్‌ తోపాటు, ఐఎస్‌ఓ గుర్తింపు తేవడం కోసం సంగీత పాటుపడ్డారని తెలిపారు. ఇందుకు శనివారం రాత్రి సిద్ధిపేటలోని కొమటిచెర్వు కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్వచ్ఛత ఎక్సెలెన్స్‌ ఆవార్డు–2018లో భాగంగా అవార్డులు, సన్మాన కార్యక్రమం నిర్వహంచారు. కాగా మంత్రి హరీశ్‌రావు పుల్లూరి సంగీతను శాలువా, గుర్తింపు జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాపేటకు చెందిన పుల్లూరి వెంకటేశం కుమార్తె పుల్లూరి సంగీతకు పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement