9న మావోయిస్టుల రాష్ట్ర బంద్

Maoists Calls for Telangana State Strike - Sakshi

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీప్రాంతంలో గత శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 9 న (శుక్రవారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తూ మవోయిస్టు పార్టీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రజలను కోరారు.

కాగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top