‘మిషన్’కు మావోల బెదిరింపులు | Mao threats to the Mission Kakatiya | Sakshi
Sakshi News home page

‘మిషన్’కు మావోల బెదిరింపులు

May 30 2015 2:43 AM | Updated on Aug 28 2018 7:24 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టన మిషన్ కాకతీయ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను కొందరు మావోరుుస్టుల పేరుతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్తగూడలో కాంట్రాక్టర్‌కు బెదిరింపులు
తాజాగా వెంకటాపురంలో...  
పోలీసుల అదుపులో మాజీ మిలిటెంట్లు

 
 ములుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టన మిషన్ కాకతీయ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను కొందరు మావోరుుస్టుల పేరుతో బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.    గత వారం నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో మిష న్ కాకతీయ కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు సమాచారం. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో పూర్తి సమాచారంతో కథనం ప్రచురితం కావడంతో వారు కాస్త వెనకడుగు వేశారు. తాజాగా శుక్రవారం వెంకటాపురం మండ లం బూర్గుపేట చెరువు వద్ద పనులు చేస్తున్న జేసీబీని మావోలు దగ్ధం చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం మాజీలు మావోల పేరుతో కాంట్రాక్టర్‌ను కలిశారు. దీంతో వారు ఎదురుతిరగడంతో వెనుదిరిగినట్లు సమాచారం.  

 డబ్బులు దండుకోవడానికే ప్రణాళిక
 కేకేడబ్ల్యూ కార్యదర్శి, గణపురం మండలం కొండాపురం గ్రామానికి చెందిన మర్రి నారాయణ అలియాస్ యాదన్న అలాయాస్ సుధాకరన్న, భార్య పుష్పక్క 2013లో జరిగిన ప్రత్యేక బలగాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఏజెన్సీలో మావోల కదలికలు పూర్తిగా స్తంభించిపోయూరుు. అయితే నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి కొందరు ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారు.

వీరిలో వెంకటాపురం మండలానికి చెందిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, గోవిందరాపుపేట మండలం పస్రాకు చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కోటి అభిలాష్ అలియాస్ చందర్, ములుగు మండలానికి చెందిన గోలి శ్రీనివాస్, కునుకుంట్ల రాజు, అలియాస్ స్వామి ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. వీరిపై ప్రభుత్వం భారీగా రివార్డులు సైతం ప్రకటించింది.  కాగా వెంకటాపురం మండలానికి చెందిన  చెరువు కాం ట్రాక్టర్‌ను శుక్రవారం పోలీసులు విచారించినట్లు తెలిసిం ది. వారు ఇచ్చిన సమాచారంతో అనుమానం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 పొక్లెరుున్ దహనం
 వెంకటాపురం: మండలంలోని బూర్గుపేట శివారులోని మారేడుగొండ చెరువులో మిషన్ కాతీయ పనులు చేస్తున్న పొక్లెరుున్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి   దగ్ధం చేశారు.  మారేడుగొండ చెరువులో రాత్రి 9 గంటల వరకు మట్టి పనులు చేపట్టి పొక్లెరుున్‌ను తూము సమీపంలో  డ్రైవర్ నిలిపి వేసి భోజనానికి వెళ్లాడు. 9.50 నిమిషాలకు  మిషన్ వద్ద నుంచి మంటల వస్తుండడంతో డ్రైవర్ గమనించాడు. అప్పటికే న లుగురు వ్యక్తులు మిషన్‌పై డీజిల్ చల్లి మిషన్‌ను దగ్ధం చేసి పారిపోయారు.  శుక్రవారం వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పొక్లెయిన్ కాలిపోవడంతో చెరువు పనులు ఆగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement