‘మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు’ | many ready to join BJP, says muralidhar rao | Sakshi
Sakshi News home page

‘మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు’

May 16 2017 7:24 PM | Updated on Mar 29 2019 9:07 PM

‘మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు’ - Sakshi

‘మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు’

బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమతో చాలా మంది టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా: బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమతో చాలా మంది టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా? అని విలేకరులు అడిగినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. రాష్ట్రంలోని వివిధ స్థాయిల నాయకులు ఢిల్లీ, హైదరాబాద్‌ నాయకులతో నిరంతరం చర్చిస్తున్నారని తెలిపారు. అయితే ఎవరెవరు చేరుతున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement