రాగల 24 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు | Mansoon Arrives In Kerala Within 24 Hours | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు

May 31 2020 9:02 PM | Updated on May 31 2020 9:23 PM

Mansoon Arrives In Kerala Within 24 Hours - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తీవ్రమైన ఎండ దాటకి ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నేడు కురిసిన వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది. రాగల 24 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. చత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ, కోస్తా ఆంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర పేర్కొంది. తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement