విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో చోటుచేసుకుంది.
కరీంనగర్(రామడుగు): విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుంటి కనకయ్య(32) మంగళవారం రాత్రి తన భార్యతో అప్పుల విషయమై గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఇంటి ముందు ఉన్న కరెంటు తీగలు పట్టుకోవడంతో కనకయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.