నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులో ఓ వ్యకి దారుణ హత్యకు గురయ్యాడు.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులో ఓ వ్యకి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. డిచ్‌పల్లికి చెందిన సంజీవ(50)ను స్థానిక దర్గా వద్దకు గురువారం అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు పని ఉందంటూ తీసుకెళ్లారు. అయితే సంజీవ శుక్రవారం విగత జీవిగా స్థానికులకు కనిపించాడు. మృతుడి శరీరంపై కత్తి పోట్లు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్ స్క్యాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(డిచ్‌పల్లి)