వ్యక్తి దారుణ హత్య | Man brutally murdered | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Aug 21 2015 3:40 PM | Updated on Sep 3 2017 7:52 AM

జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.

నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) : జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. బండరాళ్లతో మోది హత్య చేసిన తర్వాత శవాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారు. చనిపోయిన వ్యక్తి ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన యాదగిరి(40)గా గుర్తించారు.

ఈనెల 17న యాదగిరి కనిపించటంలేదని కుటుంబసభ్యులు ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆ రోజు నుంచి కేసు దర్యాప్తులో ఉంది. కాగా శుక్రవారం యాదగిరి మరణవార్తతో వారింట్లో విషాదం నెలకొంది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement