పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు | Mad dogs attack on 22 people | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు

Mar 6 2017 3:23 AM | Updated on Oct 16 2018 6:08 PM

పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు - Sakshi

పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు

తాండూరులో ఆదివారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 22 మందిపై దాడి చేసి గాయపర్చాయి.

నలుగురిని హైదరాబాద్‌కు తరలింపు

తాండూరు టౌన్‌: తాండూరులో ఆదివారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 22 మందిపై దాడి చేసి గాయపర్చాయి. స్థానికులు కుక్కలను తరిమేందుకు యత్నించగా వారినీ వదలలేదు. ఒక మహిళ వేసుకున్న స్వెట్టర్‌ను పట్టుకుని రోడ్డుపై లాక్కుంటూ కొద్దిదూరం వరకు తీసుకెళ్లాయి. గాయపడిన వారిని తాండూరు ఆస్పత్రిలో చేర్పించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. అయితే, తాండూరులోని వంతెన సమీపంలో కొందరు వేస్తున్న జంతు కళేబరాలను తిన్న కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement